ఒకానొక రోజు.బస్సు కోసం భారంగా ఎదురు చోస్తున్నరోజు.
రానే వచ్చింది మన భాగ్యనగర పుష్పక విమానం.వందలమందెక్కినా మరొకరికి చోటుంటూనే వుంటుంది.
దిగేవాళ్ళు దిగుతూనేవున్నారు ఎక్కేవాళ్ళెక్కుతూనేవున్నారు.
ఇవాళ కూడా శ్రీశ్రీ గార్ని తలచుకోకతప్పేట్టులేదు(పదండి ముందుకు పదండి త్రోసుకు).
ఏమయ్యా కంగారుదేనికి ముందు దిగేవాళ్ళని దిగనీ.
రోడ్డుప్రక్క అసామి.
ఉచిత సలహా.
నీ సొమ్మేంపోయింది చొటుదొరక్కపోతే నుంచోవలసినోన్ని నేను(మనసులో).
దిగేవాడు దిగేదాక ఆపుతాడు బస్సు.కాని ఎక్కేవరకు ఏ డ్రయివర్ ఆపుతాడు.
ఏమండి మీరే చెప్పండి అవునాకాదా.
హమ్మయ్యా ఎట్టకేలకు దొరికింది.
ప్రక్కనున్న ఆసామి దినపత్రిక తీసారు.
తల తెలియకుండానే తిరిగిపోయింది.
ఏముంటాయ్.హత్యలు మానభంగాలు బాంబు పేలుళ్ళు.బాంబులు పెట్టే వాళ్ళుదొరకరు,ముక్కీ మూలిగి పట్టుకున్నా వెధవల్ని వురితీసిపారేస్తే ఏ గొడవాలేదు.
ఆళ్ళని పట్టుకొని విచారణలు నాశ్రాధ్దం నా పిండాకూడున్నూ.
ఏమన్నా అంటే మానవహక్కులసంఘాలు వురి అమానుషం అంటూ.
ఆళ్ళు బాంబులెట్టి వందలమందిని లేపేసినా పరువాలేదు మనమ్మాత్రం శ్శాంతి శ్శాంతి హీః.
మనం మారం వాళ్ళసలే మారరు.
నా గొణుగుడుకి పత్రికా పుత్రుడికి స్ప్రుహొచ్చింది.
ఎగాదిగా చూసి నాచేతులదగ్గర చూపుల్నాపేశాడు.
ఏంటంత తీక్షణంగా చూస్తాడు చేతిలో కోతులాడ్తున్నయా.
తీరా చూస్తే నాచేతిలోనూ అదే పత్రిక.
హి...హి..హి.
బస్సేక్కేముందే కోన్నా అలవాటులేని పనికదా మర్చిపోయా.
అమ్మో దిగవలసిన చోటోచ్చేసింది.ఛీ...ఛీ..ఛీ..ఏం మనుషులో ఏంటో లోపలున్నవాళ్ళని దిగనిస్తే ఖాళీ అవుతుందన్న కనీస ఙానంకూడాలేదు.
మీరే చెప్పండి అవునాకాదా.
Tuesday, August 5, 2008
Friday, July 18, 2008
చిన్న సందేశాలు
నా జేబులోని బుల్లి బూచాడికి వచ్చిన సందే శాలు కొన్ని.తెలుగు లో తర్జుమా చేసి.
మొదటిది:
చిరంజీవి గారు రజినికాంత్ ని ఇలా అడుగుతున్నారు.
చిరు:నా శంకర్ దాదా జిందాబాద్ సినిమాలొ రవితేజా వున్నాడు,పవన్ కళ్యాణ్ వున్నాడు,అల్లు అర్జునున్నాడు,నాగబాబున్నాడు,ప్రభుదేవా వున్నాడు అయినా సినిమా హిట్ అవలేదు.శివాజిలో నువ్వొక్కడవే అయినా హిట్ అయ్యింది ఎలా బాసు.
రజిని:నాన్నా పందులే గుంపుగా వస్తాయ్.సిమ్హం సింగిల్ గా వస్తుంది.
(ఎవ్వర్ని నొప్పించడానికి కాదు)
రెండవది:
సంతోషం కరమైన సంధర్బాలలొ నన్ను మర్చి పోవద్దు.కష్టపరిస్థితుల్లో నన్ను నమ్ము.ఏమి తోచని సమయంలో నాకు కాల్ చెయ్యి.ఖాళిగా వున్నపుడు నాకు ఎస్సెమ్మేస్ చెయ్యి.
ఈలోకంలో కొన్ని జంటలు అద్బుతంగా వుంటాయి.ఉదా:-గుండె మరియు గుండె చప్పుడు,చంద్రుడు మరియు రాత్రి,గులాబి మరియు ప్రేమ,పక్షులు మరియు పాటలు,నా ఎస్సెమ్మెస్ నీ నవ్వు.
ఇవి మచ్చుకు.

Saturday, July 12, 2008
ఆమె నేను
నేను: పరిచయం అవసరం లేదనుకుంట.
ఆమె:వివరాలు తెలియదు
ప్రదేశం:భాగ్యనగరంలో ఒక బస్టాపు.ఒకానొక మధ్యాహ్న సమయం.ఒక్కణ్ణే.
నేను:అరచేతుల్ని చేంపలకానించి మోచేతులు రెండు నాముందున్న ఐరన్ స్టాండ్ పై పెట్టి నిలుచున్నా.
కొన్నిక్షణాల తరువాత ఆమె వచ్చింది.
నేను:అబ్బా ఏం అందం(మనసులో)
నేను:కొద్దిసేపు కాదు..కాదు.. చాలా సేపు అలాగే చూస్తుండిపోయాను.
ఆమె:మధ్యలో రెండు మూడుసార్లు నావంక యధాలాపంగా చూపులు.
కొద్ది సేపటి తరువాత
నేను:హలో...(ఆమెవంకే చూస్తు)
ఆమె:కంటి చూపుతో చంపేసేట్టు ఒకచూపు.
నేను:మొహంపై చిరునవ్వు.
నేను:మీ పేరు తెలుసుకోవచ్చా.
ఆమె:కళ్ళు కొంచెం పెద్దవయ్యయ్.పెదాలు వనుకుతున్నాయ్.
నేను:చిరునవ్వు స్థానంలో ఆశ్చర్యం.అయినా ఆమెనే చూస్తున్నా
నేను:అంతకొపమెందుకండి అడిగింది పేరేకద.
ఆమె:మోము ఎర్రబడింది.కళ్ళది కూడా అదే బాట.
నేను:ఆశ్చర్యంస్థాయి పెరిగింది.చిరునవ్వు చెదరలేదు.కుడి చేయి ఎడమ మోచేతి కిందికొచ్చింది.
నేను:ఎందుకంత కోపం..!కోపంలో కూడా చాలా అందంగా వుంది(మనసులో) పోని మీరేంచేస్తారో తెలుసుకోవచ్చా.
ఛట్
కొద్దిక్షణాలు నిశ్శబ్దం
నేను:కళ్ళముందు తారాలోకం.
ఆమె:నిలువెల్లా వణికిపోతు.
నేను:హలో నేనొక అరగంట తరువాత మళ్ళి చేస్తాను.సెల్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకొన్న.
ఆమె:కోపం స్థానంలో ఆశ్చర్యం.పెద్దవైన కళ్ళు చిన్నబోయాయ్.యర్రబారిన కళ్ళలో బెరుకు.
నేను:ఎందుక్కొట్టారు...?
తరువాతేంజరిగిందో నేను చెప్పను.
తపా ఇన్నిరోజులు ఆలశ్యంగా ఎందుకొచ్చిందో కూడా చెప్పను.
ఈ పాటికే మీ ఊహలు రెక్కలు తొడుక్కొనుంటాయి.వాటినలాగే స్వేచ్ఛగా వదిలేయండి అన్ని ప్రశ్నలకి జవాబుల్ని అవే మోసుకొస్తాయ్.

Subscribe to:
Posts (Atom)